ఆదిత్యలో భవిష్యత్ ప్రణాళికపై శిక్షణా తరగతులు

UPDATED 9th FEBRUARY 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో భవిష్యత్ ప్రణాళికలపై విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు విశ్వవిశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ టి. శ్రీనివాస ఆచార్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ నుంచే భవిష్యత్ పై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కృషి చేసిన వారు ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారని అన్నారు. డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ మన ప్రతిభ ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకుని ప్రయత్నిస్తే అధ్యాపకులు వారి ఉన్నతికి సహకరిస్తారన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల భాషపై నైపుణ్యం పెంపొందించుకుని నేటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పి.జి.డి.ఎం, ఎంబీఏ విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us