ఆరోగ్య రక్ష కార్డులు రెన్యూవల్ గడువు పెంపు

UPDATED 7th APRIL 2018 SATURDAY 6:00 PM

కాకినాడ: గడచిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆరోగ్య రక్ష పథకంలో నమోదు చేయించుకున్న లబ్దిదారులు తమ ఆరోగ్య రక్ష కార్డులు రెన్యూవల్ చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డాక్టర్ ఎన్.టి.ఆర్ వైద్యసేవ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ వి. వరప్రసాద్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెన్యువల్ కు ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ డా.ఎన్.టి.ఆర్. వైద్యసేవ ట్రస్ట్  సిఈవో డాక్టర్ ఎ. రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారని, ఏప్రిల్ 30వ తేదీ లోపు రెన్యువల్ చేయించుకున్న వారి కార్డు 24 గంటలలోపు యాక్టివేట్ చేయబడుతుందన్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి రూ.1200 సంవత్సర ఫీజుతో కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. ఇందుకు ఆధార్ కార్డు, దానికి అనుసంధానం చేయబడిన మొబైల్ ఫోన్ తో మీ దగ్గరలో ఉన్న నెట్ వర్క్ హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా హాస్పిటల్, రాజమండ్రి జిల్లా హాస్పిటల్, కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్న వైద్యమిత్రలు, ఆరోగ్య రక్ష ఏజెంట్ దినకర్ ని సంప్రదించవచ్చని సూచించారు. అలాగే వివరాలకు 9398810118 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us