కందుకూరి జాతీయ పురస్కారానికి సాయిరామకృష్ణ ఎంపిక

UPDATED 26th OCTOBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమీషన్, ఫిలాంత్రోఫిక్ సొసైటీ సంయుక్తంగా ఈ నెల 27వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నకందుకూరి జాతీయ శత స్మారక పురస్కారాలలో భాగంగా స్థానిక అయోధ్యరామపురం ఉన్నత పాఠశాల హెచ్ఎం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ ఈ గౌరవ పురస్కారానికి  ఎంపికయ్యారు. వివిధ రంగాలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన వ్యక్తులకు ఇచ్చే నవయుగ వైతాళికుడు కందుకూరి స్మారక పురస్కారానికి ఎంపికైనట్లు ఈ మేరకు సాయిరామకృష్ణకు ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు. శనివారం ఆనం కళాకేంద్రంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప, పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. పుస్తక రచయితగా, గణిత అవధానిగా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా బహుముఖ సేవలు అందించడం ద్వారా గుర్తింపు పొందిన సాయిరామకృష్ణను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు, పాఠశాల వ్యాయమ  ఉపాధ్యాయుడు తాళ్ళూరి వైకుంఠం, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us