UPDATED 21st SEPTEMBER 2017 THURSDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో ఈ నెల 23 న వరల్డ్ ఫార్మసీ డే పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా జిల్లా డ్రగ్ ఇనస్పెక్టర్ ముద్దుకూరి చంద్ర శేఖరరావు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఫార్మసీ కళాశాలల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వ తేదీ వరకు దసరా సెలవులు కారణంగా ఈ కార్యక్రమాలను ముందుగా జరుపుతున్నామని, ప్రముఖుల ప్రసంగాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలుతో ఈ వేడుకలు ఉదయం 9 .30 కి ప్రారంభమై సాయంత్రం 4 .00 గంటలకు ముగుస్తాయన్నారు. గత విద్యా సంవత్సరం లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినా విద్యార్థులను మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్ తో సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.







