ఓపెన్ స్కూల్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 21st OCTOBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ఆర్థికపరమైన, ఇతర కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారికి ప్రభుత్వం ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కల్పించిందని, దీనిని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కె. జనార్ధన్ పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గల అధ్యయన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవు రోజుల్లో నిర్వహించే తరగతులకు అభ్యర్థులు హాజరై మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ తోటకూర సాయిరామకృష్ణ, అసిస్టెంట్ కోఆర్డినేటర్ తాళ్లూరి వైకుంఠం, కోడూరి శివప్రసాద్, నాగేశ్వరరావు, ఓపెన్ స్కూల్ సూపరెంటెండెంట్ నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us