వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు

UPDATED 12th NOVEMBER 2019 TUESDAY 9:30 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య సాంస్కృతిక కళా వేదికలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా  నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలలో మహాన్యాసం, పార్వతీ సమేత ఉమా పార్థివ పరమశివునికి ఏకాదశ మహా రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పం నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 6-30 నిమిషాలకు సహస్ర బిల్వార్చన, పుష్పార్చన, రా 7గంటలకు చంద్రబింబ దర్శనం, రాత్రి 8గంటలకు జ్యోతిర్లింగార్చన, నీరాజన మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు, కార్యదర్శి కృష్ణ దీపక్ రెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి దంపతులు, ఆదిత్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us