ఆర్డీవోతో డిఈఈ భేటీ

UPDATED 24th JULY 2019 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో ఏడిబి రహదారి డిఈఈ వై. రవీంద్ర ఆర్డీవో ఎస్. మల్లిబాబుతో బుధవారం సమావేశమయ్యారు. సామర్లకోట-రాజానగరం మధ్య చేపట్టిన ఎడిబి రహదారి విస్తరణకు సంబంధించి భూసేకరణ పరిహారానికి సంబంధించిన బిల్లు బకాయిలు ట్రెజరీలో ఉన్నందున రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని రైతులు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు డీఈఈ ఆర్డీవో దృష్టికి తెచ్చారు. రహదారి నిర్మాణం నిమిత్తం అవసరమైన భూమి ఇవ్వడానికి అభ్యంతరం తెలియజేస్తున్న రైతుల వివరాలను అందజేయాలని, ఆ వివరాలను అనుసరించి రైతులను స్వయంగా కలిసి అభ్యంతరాలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆర్డీవో డిఈఈకి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు భాను, రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us