ప్రజా సమస్యల పరిష్కారమే స్పందన లక్ష్యం

UPDATED 15th JULY 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. వీటిలో కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామానికి చెందిన గుడాల శ్రీనివాసరావు గయ్యాల భూమిని ఎస్సీలకు పంచమని, కిర్లంపూడి హరిజన పేటకు చెందిన కావలి గంగారావు 4 ఎకరాల 60 సెంట్లు ల్యాండ్ సీలింగ్ భూమిని ఎస్సీ వర్గాల వారికి ఇప్పించమని, పెద్దాపురం పట్టణానికి చెందిన ఎం. సత్తిబాబు, తదితరులు ఏడు నెలల నుంచి బకాయిపడిన వృద్ధ కళాకారుల పింఛన్ మంజూరు చేయించాలని, కోటనందూరుకు చెందిన అంకమరెడ్డి కృష్ణ  రైతులు ఆక్రమించుకున్న కాలువగట్టు సరిహద్దును సర్వే చేయించి న్యాయం చేయమని, శృంగరాయుని పాలెంకు చెందిన మల్లాపు నాగేశ్వరరావు ఏలేరు ఆధునీకరణ పనులలో నష్టపోయిన భూమికి పరిహారం ఇప్పించమని, మల్లిసాలకు చెందిన వేమగిరి భాస్కరరావు సబ్ డివిజన్ సర్వే చేయించమని, పులిమేరుకు చెందిన విశాకోటి వెంకటరమణ ఆక్రమణలపై చర్యలు తీసుకోమని, మర్లావకు చెందిన మిర్యాల పద్మావతి డ్వాక్రా గ్రూపుల పసుపు-కుంకుమ సొమ్ము రాలేదని, పెద్దాపురంకు చెందిన రంధి సత్యనారాయణ రోడ్డుకు రీటెండర్ పిలవాలని అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ అర్జీలను పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us