AP News: ఉద్యోగ సంఘాలతో ముగిసిన ఏపీ ప్రభుత్వ చర్చలు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పీఆర్‌సీ నివేదికపై సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన భేటీ ముగిసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. జీతాల పెంపు అమలు తేదీలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పెంచిన జీతాలను 2018 జులై నుంచి వర్తించజేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల తరఫున ఐకాస నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పీర్‌సీ సహా 71 డిమాండ్లపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us