UPDATED 10th JANUARY 2019 THURSDAY 9:00 PM
గండేపల్లి: ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్కం ప్రత్యేక శిబిరం ఐదవ రోజుకు చేరుకుంది. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ప్రజలు వీధులను శుభ్రపరిచారు. చెత్త వల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు చేరి అనేక రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ సూచించారు. స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని డాక్టర్ సుగుణారెడ్డి గ్రామస్థులను ప్రోత్సహించారు.







