నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ నాయకులు

UPDATED 19th AUGUST 2017 SATURDAY 7:00 PM

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొని శనివారం ఉత్సాహంగా ప్రచారం చేశారు. ఈ సంధర్భంగా గాంధీ బజార్, గోల్డ్ బజార్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు.  కాంగ్రెస్ గతంలో చేసిన మంచి పనులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, రాహుల్ గాంధీ, యూపీఏ మిత్రపక్షాలకు "ప్రత్యేక హోదా", ఇతర విభజన హామీలపై ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు విపులంగా వివరించారు. అలాగే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డి ప్రదీప్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జిలు అబ్రహం రాయ్ మణి, ఊట్ల వరప్రసాద్, అర్షద్, మనోహర్ రెడ్డి, ఖాసిం మున్నా, మోహన్ రెడ్డి, మోహిత్, రాజేష్ తదితరులు ఈ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us