కార్మికుల సంక్షేమమే సీఐటీయూ లక్ష్యం

UPDATED 10th NOVEMBER 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే సీఐటీయూ లక్ష్యమని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కరణం విశ్వనాధం అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గ్రామ మహాసభ మండల పరిధిలోని వెంకట కృష్ణ రాయపురం గ్రామంలో ఆదివారం జరిగింది. తొలుత సీఐటీయూ పతాకాన్ని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కరణం విశ్వనాధం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నుంచి సీఐటీయూ పోరాటాల ఫలితంగా బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ పధకం అమలులోకి వచ్చిందని, బిల్డింగ్ వర్కర్స్ శ్రమ ద్వారా సెస్ వస్తుందని అన్నారు. కేంద్ర  ప్రభుత్వం ఈ పధకాన్ని రద్దు చేయాలని చూస్తోందని, దీనిని నిరసిస్తూ డిసెంబర్ 5న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల గౌరవాధ్యక్షులు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇసుక సరఫరా లేని కారణంగా కార్మికులకు పనులు లేక అప్పుల్లో మునిగి ఆత్మహత్యలు  చేసుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు కరువు భత్యం ఇవ్వాలని, ఇసుకను తక్షణమే సరఫరా చేయాలని కోరారు. అనంతరం జరిగిన గ్రామ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా మలిరెడ్డి శివదుర్గ, ఉపాధ్యక్షులుగా కుర్రా వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా శాఖా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా స్వామి, కోశాధికారిగా కరణం రమేష్, కుర్రా నగేష్ ఎన్నికయ్యారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us