కాకినాడ (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: కాకినాడ జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతిగా ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూకేను ఆదర్శవంతమైన సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రసాద రాజుకు రిజిసా్ట్రర్ ఎల్.సుమలత, ఓఎస్డీ రవీంద్రనాథ్, డైరెక్టర్లు ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు, వి.రవీంద్ర, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వర్శిటీ అనుబంధ కళాశాలల మేనేజ్‌మెంట్లు, అధ్యాపక, అధ్యాపకేతర, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







