కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతాం

UPDATED 12th JULY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: రాబోయే ఎన్నికల్లో కేంద్రానికి తగిన గుణపాఠం జైభారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. ఉత్తరాది పర్యటన ముగించుకుని గురువారం సామర్లకోట చేరుకున్న ఆయనకు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక రైల్వే కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ రైతులు, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని, రాజకీయలబ్ది కోసం కాదన్నారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్ ఎనిమిదిన దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ  జెండాను ఆవిష్కరించి పార్టీ విధి, విధానాలు గురించి తెలిపామని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో తప్ప ఏ పార్టీతో అయినా పొత్తుకు సిద్దమన్నారు. నేటి  రాజకీయ పరిస్థితులను చూస్తే ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలకు సరియైన న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. తమ పార్టీ ప్రతీ ఒక్క పేదవానికి అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us