ఆనూరులో ఆదిత్య విద్యార్థుల శ్రమదానం

UPDATED 27th FEBRUARY 2018 TUESDAY 5:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ కు చెందిన విద్యార్థులు మంగళవారం శ్రమదానం చేశారు. జాతీయ సేవా పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. కళాశాల ఆనూరు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సర్పంచ్ సింగన అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమని, యువత సమాజ సేవలో పాల్గొంటే సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం విద్యార్థులు బృందాలుగా విడిపోయి గ్రామంలో పరిశుభ్రతా కార్యక్రమాలతో పాటు, ప్రజలకు పరిశుభ్రత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, డాక్టర్ ఈ. మోహన్, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డీనేటర్ సి.హెచ్. నాగభూషణం, వాలంటీర్లు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us