UPDATED 14th MARCH 2018 WENESDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థి కాకినాడ జె.ఎన్.టి.యు. నిర్వహించిన ఇంటర్ కాలేజ్ గేమ్స్ & స్పోర్ట్స్, అథ్లెటిక్స్ మీట్-2018లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో 56 కళాశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో తమ కళాశాల విద్యార్థి కె.వి.ఎస్.ఆర్.దుర్గా ప్రసాద్ లాంగ్ జంప్ లో ప్రథమస్థానం, ట్రిపుల్ జంప్ లో ద్వితీయ స్థానం సాధించినట్లు ఆమె తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, ప్రొఫెసర్ ఆస్థా శర్మ విద్యార్థిని అభినందించారు.







