* హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
UPDATED 19th OCTOBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం వుండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దాపురం బచ్చు ఫౌండేషన్ సంస్థ నిర్మించిన ఎనిమిది తరగతి గదులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ బచ్చు ఫౌండేషన్ అధినేత డాక్టర్ బచ్చు కోటేశ్వరావు కుటుంబ సభ్యులు విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం, వీరు అందిస్తున్న సహాయ సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం దాతలను హోంమంత్రి ఘనంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కంకణాలపల్లి సత్యన్నారాయణ, కె. రాధాకృష్ణ, కొప్పిరెడ్డి వీరసాల్మన్, ఎం. వీరబాబు, సిహెచ్ జగ్గారావు, బి. వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







