ఆదిత్యలో టి-కనెక్ట్ 2.0 ఎగ్జిబిషన్ ప్రారంభం

UPDATED 18th SEPTEMBE 2018 TUESDAY 7:00 PM

గండేపల్లి : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ లో ఈనెల 17 నుంచి 29 వరకు అంతర్జాతీయస్థాయిలో టి-కనెక్ట్ అనే టెక్నికల్ హబ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టెక్నికల్ హబ్ సిఇవో బాబ్జి  నీలం మాట్లాడుతూ నేడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో నూతన ఒరవడులను అందిపుచ్చుకొనే ఆసక్తి గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆదిత్య టెక్నాలజీ హబ్, టి-.కనెక్ట్ 2.0 పేరిట ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని అన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఫోరెన్సిక్, పాలిటెక్నిక్, సి.బి.ఎస్.సి విద్యార్థులకు వివిధ రకాల సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ టెక్నాలజీలు, వాటి ఉపయోగాలు, ఉద్యోగ అవకాశాల గురించి తమ సీనియర్ విద్యార్థులు, టెక్నికల్ హబ్ టీంచే పూర్తి అవగాహన కల్పించడమే ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఆదిత్య కళాశాలలో చదివే ప్రతీ విద్యార్థి ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ మెళుకువలు, వృత్తిలో ఎలాంటి నైపుణ్యం పొందాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ద్వారా టెక్నికల్ సిబ్బంది, విద్యార్థుల సహాయ సహకారాలతో అవగాహన కల్పించేందుకు క్యాంపస్ లో టెక్నికల్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతీ విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతో పాటు నేటి ఆధునిక పారిశ్రామిక రంగాలలో అవసరాలకు అనుగుణంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి పలు అధునాతన ఎమర్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసే విధంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆసక్తి గల రంగాలలో వాటి గురించి వివరించటం జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారికి ఆయా విభాగాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులలో అవగహన, నైపుణ్యం, సామర్థ్యాలను పెంపొందించేందుకు టి-హబ్, ఆదిత్య యాజమాన్యం ఎప్పుడు విద్యార్థి అభివృద్దే పరమావధిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మార్చినెల మూడవ తేదీ 2016లో మొదలైన టెక్నికల్ హబ్ లో నైపుణ్యం కలిగిన విద్యార్థులు పలు కార్పొరేట్ సంస్థల్లో  ఉద్యోగాలు పొందారని, ఇంతవరకు సుమారు 500 మంది వివిధ కంపెనీల్లో మంచిస్థానంలో ఉన్నారని అన్నారు. 25  కంపెనీలకు పైగా సర్టిఫికేషన్ కోర్సులకు ఎటువంటి రుసుము లేకుండానే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆదిత్య యాజమాన్యం విద్యార్ధి సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు రూ. 70లక్షల కేటాయించి వివిధ  శిక్షణా తరగతుల ద్వారా, ఇండస్ట్రీ వీకెండ్ ప్రోగ్రాం ద్వారా ప్రతీవారం ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో కార్యక్రమాలు రూపొందిస్తూ కంపెనీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. నూతన ఆలోచనలతో వచ్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి రూ. 5000/- వరకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం, కాలుష్యరహిత బ్యాటరీతో నడిచే వాహనం తయారు చేసిన విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించి  ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు చదువు పూర్తిచేసిన విద్యార్థులు ఉద్యోగాలకోసం కంపెనీల చుట్టూ తిరగటం కాదని, ఆదిత్య విద్యార్థుల  కోసం కంపెనీలు పోటీపడి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దటమే తమ పరమావిధిగా టి-హబ్ ద్వారా కృషి చేస్తున్నామని అన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us