రుణాలు సకాలంలో చెల్లించాలి

UPDATED 13th MARCH 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: రుణాలను సకాలంలో చెల్లించాలని డి.ఆర్.డి.ఎ పిడి మల్లిబాబు పేర్కొన్నారు. స్థానిక టిటిడిసిలో స్త్రీనిధి కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్త్రీనిధి 14 మండలాల్లో వెనుకబడి ఉందని, దాని గురించి వెంటనే స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుని రుణాలను వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఐబిఎం పసుపు, కుంకుమ పెట్టుబడి కింద మహిళాదినోత్సవం సందర్భంగా రాని వాళ్లని ఇప్పుడు పేర్లు తీసుకోవాలన్నారు. ఈ నెల 15 వరకు సమయం ఉందని, స్త్రీనిధిలో చాలా వెనుకబడి ఉన్నామని, రాష్ట్రంలో పదవ స్థానంలో ఉన్నామన్నారు. అలాగే డిఎంజి మండలానికి వెళ్లి పుస్తక నిర్వహణ సరిగ్గా ఉందో లేదో కేబిలింగ్ ఎపిఎం కూడా సంతకం పెట్టాలన్నారు. మిగతా మండలాల్లో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులను పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ఎస్ మేనేజర్ గిరి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు టి. నాగదుర్గ, కార్యదర్శి భవాని, కోశాధికారి ఎం. లలిత, ఉపాధ్యక్షురాలు కె. కృష్ణజ్యోతి, ప్రాజెక్టు మేనేజర్ వై.బి. రత్నాకర్, స్త్రీనిధి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us