గైట్ లో అవేవా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రారంభం

UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో ఏర్పాటు చేసిన అవేవా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను అవేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నవతేజ్ గరేవాల్, గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మలతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం గైట్ ఎండి శశికిరణ్ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి అవేవా వైస్ ప్రెసిడెంట్ నవతేజ్ గరేవాల్ మాట్లాడుతూ నేటి యువ ఇంజనీర్లే రేపటి పారిశ్రామిక లక్ష్య విజేతలని, భావి ఇంజినీర్లలో సామర్థ్యం మెండుగా ఉందని అన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలో అనేక అత్యాధునిక మార్పులు చోటు చేసుకోనున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులను తయారుచేసి ప్రపంచంలో జరిగే టెక్నాలజీ అత్యాధునిక మార్పులు అందించేందుకు అవేవా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అవివాలో శిక్షణ పొందిన విద్యార్థులు వారి నైపుణ్యాలు, సామర్ధ్యాలను అనుసరించి పవర్ ప్లాంట్లు, పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు, నిర్మాణ రంగం, యాంత్రీకరణ మోడలింగ్ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు పొంది ఉన్నతస్థాయిలో ఉంటారని పేర్కొన్నారు. అవేవా, గైట్ సిబ్బంది, విద్యార్థులు సంయుక్తంగా రూపొందించబోయే ప్రాజెక్టులు టెక్నాలజీకి మరెంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. గైట్ ఎండి శశికిరణ్ వర్మ మాట్లాడుతూ ప్రపంచదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన నౌకా నిర్మాణ సంస్థలు, గ్యాస్, పెట్రోలియం వంటి బహుళ జాతి సంస్థలకు అవేవా సంస్థ టెక్నాలజీ సేవలు అందిస్తోందని, ప్రఖ్యాతి గాంచిన అవేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తమ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, దీని ద్వారా మెకానికల్, సివిల్, ఎలెక్ట్రికల్, పెట్రోలియం, ఆటోమొబైల్, మైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేకమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున ముఖ్య అతిధి నవతేజ్ గరేవాల్ ను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మూర్తి, డాక్టర్ ఎన్. లీలావతి, డైరెక్టర్ పి.ఆర్.కె. రాజు, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.               

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us