UPDATED 6th AUGUST 2018 MONDAY 9:00 PM
పెద్దాపురం: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) అధ్యక్షతన మండలంలోని దివిలి గ్రామంలో గత ఐదు సంవత్సరాల పాటు పదవీకాలాన్ని దిగ్విజయంగా నిర్వహించిన సర్పంచులను ఉప ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచులు పూర్తి స్వేచ్ఛతో పరిపాలన సాగించారని, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనలో వీరి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో అనేక మంది సర్పంచులు తమ పదవీకాలంలో ఎన్నో గుర్తుండి పోయే పనులు చేశారని, అలాగే పంచాయతీలకు నూతన భవనాలు, సిసి రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టరు ఎలిశెట్టి నాని, ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, ఎంపిపి గుడాల రమేష్, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, ఎంపీడీవో పి. వసంతమాధవి, సర్పంచులు బూరాడ రాఘవమ్మ, అంబటి నూర్యప్రకాశరావు, నడిగట్ల శ్రీనివాసరావు, తుమ్మల అజ్ఞావతి, మెయిళ్ల కృష్ణమూర్తి, పాఠంశెట్టి పల్లారావు, కుంచే గాంధీ, పాలచర్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.







