యువత లక్ష్యసాధనకు కృషి చేయాలి

UPDATED 26th SEPTEMBER 2018 WEDNESDAY 7:00 PM 

రాజానగరం: యువత నిర్దేశిత లక్ష్యంతో విజయాపథం వైపు సాగుతూ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రముఖ సీనియర్ చలనచిత్ర నటుడు, అంతర్జాతీయ వక్త ప్రదీప్ అన్నారు. స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు అధ్యక్షతన రెండురోజులు పాటు నిర్వహించు యువప్రస్థానం కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. విద్యార్హతతో పాటు సరైన నైపుణ్యం, జ్ఞానం పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడమే కాకుండా ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రదీప్ తో పాటు టెక్ మహేంద్రా మాజీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఏ.ఎస్. మూర్తి, ప్రముఖ మైండ్ ఎడ్యుకేషనలిస్ట్ జయసింహ, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ సరస్వతి పాల్గొని విద్యార్థినీ, విద్యార్థులకు పలు ఆసక్తికరమైన అంశాలపై అవగాహన కల్పించి ఉత్తేజం నింపారు. ప్రతీ ప్రయాణం ఒక్క అడుగుతోనే అని గమ్యం నిర్దేశనలో ప్రదీప్ చక్కని సూచనలు ఇచ్చారు. కార్పోరేట్ రంగంలో వస్తున్న మార్పులు వాటిపై విద్యార్థులు పెంచుకోవాల్సిన నైపుణ్యం, తర్ఫీదు, వివిధ దేశాలు మనదేశ సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఏ విధమైన సేవలు పొందుతున్నారన్న విషయం గురించి ఏ.ఎస్. మూర్తి మారుతున్న టెక్నాలజీకి సమంగా విద్యార్థులు ఏ విధంగా ఉండాలి అన్న విషయంపై వివరించారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత  ఏవిధంగా పెంచుకోవాలి, నిజ జీవితంలో విద్యార్థి దశ ఏ విధంగా ప్రభావితం చేస్తుందని అనే విషయాలు చక్కగా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ 18 నుంచి 25 సంవత్సరాల విద్యార్థులపై ఈ కార్యక్రమం ఎంతగానో ప్రభావితం చేస్తుందని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో చురుగ్గా స్పందించిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.వి. ప్రసాద్, డాక్టర్ శర్మ, డాక్టర్ ధనరాజ్, డాక్టర్ నిహారిక, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us