పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

UPDATED 8th JULY 2018 SUNDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 వసంతాలు క్రితం చదువుకున్న పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఆదివారం జరిగింది. 1978-78వ సంవత్సరంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులంతా వేర్వేరు ప్రాంతాల్లో వివిధ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారంతా తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి తాము కలిసి చదువుకున్న పాఠశాలను సందర్శించారు. తాము బాల్యంలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా గడిపారు. మళ్ళీ కలుద్దాం అంటూ బరువెక్కిన హృదయాలతో ఇంటి ముఖం పట్టారు. ఈ సందర్భంగా తమకు ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు శ్రీపాద సోమయాజులు, వెంకట్రారావులను దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల హెడ్ మాస్టర్ కామేశ్వరరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉల్లి బాబురావు, మాజీ చైర్మన్ కొణతం నరసింహారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తోటకూర నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కంచుపట్ల ప్రశాంతి, కంచుపట్ల రామకృష్ణ, తదితరులు మాట్లాడారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించారు. 1977-78 విద్యార్థి, గుడా డైరెక్టర్ గట్టి సత్యనారాయణ ద్వారా బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు మైక్ సెట్ బహూకరించారు. పాఠశాల అభివృద్ధికి, పేదవిద్యార్దుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us