ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

* కాకినాడ ఎంపీ వంగా గీత 

UPDATED 15th JULY 2020 WEDNESDAY 6:30 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, సంచార సంజీవని బస్సులను వినియోగంలోకి తీసుకురావటం ఎంతో గొప్ప విషయమని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. స్థానిక ఫిషింగ్ హార్బర్ వద్ద జిల్లాకు చేరిన సంచార సంజీవని బస్సును ఎంపీ గీత, జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ సంచార సంజీవని బస్సు ద్వారా జిల్లాలో కరోనా వైరస్ అధికంగా ప్రబలే ప్రాంతాల్లో  చాలా సులభంగా శ్యాంపిల్స్ సేకరించటానికి అవకాశం ఉంటుందని, ఒకే సమయంలో సుమారు పది మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐదు వాహనాలకు ప్రస్తుతం మూడు వాహనాలు జిల్లాకు చేరాయని, వీటిని రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడలో వినియోగించటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోనల్ ఈడి సిహెచ్. రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. మల్లికార్జున్, మత్స్య శాఖ జెడి పి. కోటేశ్వరరావు, కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వై.హెచ్.ఎస్. సతీష్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us