సెల్ టవర్ నిర్మాణంలో అధికారుల తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం

UPDATED 24th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన బుధవారం జరిగింది. అజెండాలోని అంశాలను చర్చించే ముందు ప్రజా సమస్యలను చర్చించడానికి జీరో అవర్ కావాలని ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ, తదితరులు కోరారు. దీనికి  చైర్ పర్సన్ అంగీకరించారు. ఈ సందర్భంగా ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్ మాట్లాడుతూ 28వ వార్డులోని సెల్ టవర్ నిర్మాణం చేసే ప్రాంతంలో ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దానిపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సెల్ టవర్ నిర్మాణం చేయడం సభ్యులకు సరైన గౌరవం ఇవ్వకపోవడమేనని వారు ఆరోపించారు బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి లేకపోయినా సెల్ టవర్ నిర్మాణం జరుగుతుందంటే దీనికి అధికారుల సహకారం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. సెల్ టవర్ వివాదంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు అధికారుల తీరుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us