UPDATED 29th JANUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టంలోని భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర ఆధ్వర్యంలో 250 మంది ఆటోడ్రైవర్లకు యూనిఫారం పంపిణీ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని యూనిఫారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు విధిగా యూనిఫారాలు ధరించాలని, యూనిఫారాలు లేకుండా ఆటోలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర మాట్లాడుతూ గతంలో తమ సంస్థ ద్వారా సామర్లకోట పట్టణ పరిధిలో గల ఆటోడ్రైవర్లు సుమారు 500 మందికి యూనిఫారాలు పంపిణీ చేశామని, నేడు 250 మందికి ఈ యూనిఫారాలు అందచేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా పరిషత్ నాయకులు సబ్బెళ్ళ వెంకటరెడ్డి, రెడ్డి దొరబాబు, సిద్దిరెడ్డి పాపారావు, కాటంరెడ్డి దొరబాబు, చింతల సత్యం, తదితరులు పాల్గొన్నారు.







