UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 8:00 PM
సామర్లకోట : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్.ఐ శ్రీనివాస్ నాయక్ విద్యార్థులకు సూచించారు. స్థానిక సిబిఎమ్ సెంటినరీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శుక్రవారం మాట్లాడారు. మంచి వ్యక్తులతో స్నేహం చేయాలని, అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలు కలిగిన వారితో స్నేహం చేయడం వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. చదువుపై దృష్టి సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ జీవన్ కుమార్, మహిళా ఎస్.ఐ. ఎస్ .లక్ష్మి పాల్గొన్నారు.







