UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: మద్యం వ్యాపారులు తమ ట్రేడ్ మార్జిన్ శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ గత మూడురోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా గురువారం ఐ.ఎం.ఎఫ్.ఎల్. డిపో వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే మద్యం వ్యాపారులు దుకాణాలను, బార్లను మూసివేసిన సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులకు సంఘీభావం ప్రకటిస్తూ కార్మికులు తమ మద్దత్తు తెలియచేశారు. అనంతరం తమ సమస్యలపై డిపో మేనేజర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నెక్కంటి సాయి, చిక్కాల సుబ్బారావు, యాళ్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.







