హాస్టల్ కు సీలింగ్ ఫ్యాన్లు బహుకరణ

UPDATED 25th OCTOBER 2019 FRIDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): సెవెన్ హిల్స్ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పసల పద్మ రాఘవరావు స్థానిక సుధా కాలనీ శివారులో గల ఎస్సీ బాలుర డిగ్రీ హాస్టల్ కు మూడు సీలింగ్ ఫ్యాన్లు బహూకరించినట్లు పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. ఆర్డీవో తన ఛాంబర్లో హాస్టల్ విద్యార్ధులకు శుక్రవారం సాయంత్రం వీటిని అందచేశారు. గతనెలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో హాస్టల్ లో ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఆర్డీవో గుర్తించారు. ఈ సందర్భంగా ఫ్యాన్లు బహుకరించిన సెవెన్ హిల్స్ యాజమాన్యానికి ఆర్డీవో అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రామచంద్రరావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొండలరావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us