అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా అంతగా పట్టించుకోని రవాణాశాఖ.. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సన్నద్ధమైంది. తనిఖీలు ముమ్మరం చేయాలని, నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు వేయాలంటూ క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తనిఖీలు నిర్వహించి, జరిమానాల ద్వారా రూ.352 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రూ.70 కోట్ల వరకు వసూళ్లయ్యాయి. తనిఖీలు పెంచి మార్చి లోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని నిర్ణయించింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







