ఆదిత్యలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణదినోత్సవ వేడుకలు

UPDATED 28th JULY 2018 SATURDAY 9:00 PM 

గండేపల్లి : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ -తీసుకోవలసిన చర్యలు అనే అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులు రూపొందించిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రంధాలయ అధికారి కె. అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ నెల విద్యార్థుల ప్రతిభకు పదును పెడుతూ, వారిలో పోటీ తత్వాన్ని పెంపొందించి చైతన్య పరిచేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ఇసిఇ విభాగం ప్రొఫెసర్స్ ఎస్. జగదీష్, పెనుమంచి బుజ్జిబాబు వ్యవహరించగా, ఉత్తమ పోస్టర్లుగా ఆర్.వి. సాయికృష్ణ, బి. నవ్య, తన్మయి ఛటర్జీలు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ .ఎస్. రమాశ్రీ,  గ్రంధాలయ సిబ్బంది నాగబాబు, వేణు, నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us