గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

UPDATED 28th OCTOBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని వేట్లపాలెం గ్రామంలో పంచాయితీ కార్యాలయం నుంచి రైల్వే క్రాసింగ్ వరకు పి.ఆర్& ఆర్.డి నిధులు రూ.90 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో గత నాలుగు సంవత్సరాలలో సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతీ గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మించామని, ఇంకా మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, త్రాగునీరు, సామాజిక భవనాలను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నియోజకవర్గ పరిధిలో ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందజేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో భాగంగానే పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం గ్రామంలో ఉన్న షిర్డీసాయిబాబా దేవాలయాన్ని  దర్శించి బాబావారికి  ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే బాలికలు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జెడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, వల్లూరి శ్రీనివాస్, పంచాయతీ రాజ్ డిఇ హరినాధరావు, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, దేవస్థానం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us