UPDATED 26th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద సీతారాముల కల్యాణోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ కల్యాణోత్సవంలో శ్రీ ఆదిలక్ష్మి ఇండస్ట్రీస్ అధినేత గోలి ధర్మరాజు దంపతులు, గోలి రవికుమార్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షులు పెండ్యాల నాగేశ్వరరావు మాష్టారు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు, జెడ్పిటిసి సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.







