UPDATED 2nd APRIL 2018 MONDAY 10:00 PM
సామర్లకోట: సామర్లకోట నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు నుంచి గుర్తు తెలియని ఒక ప్రయాణికుడు కాపవరం సమీపంలోని రైలు పట్టాలపై పడి సోమవారం మృతి చెందినట్లు స్థానిక రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 44 సంవత్సరాలు ఉండవచ్చని, అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జె. గోవిందరావు తెలిపారు.







