UPDATED 24th SEPTEMBER 2019 TUESDAY 6:30 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్&టెక్నాలజీ కళాశాలల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యశాలలు నిర్వహించారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఒక రోజు కార్యశాలకు విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పి.వి. వినయ్ పాల్గొని మెటీరియల్, హీట్ ట్రాన్స్ మెంట్ పద్దతులపై అవగాహన కల్పించారు. అలాగే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో జరిగిన రెండురోజుల కార్యశాలలో ఎబిఎం గ్రూప్ వ్యవస్థాపకులు జామి పాపారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని అన్నారు. అడ్వాన్స్డ్ ఆటోమొబైల్ వర్క్ షాప్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో అత్యాధునిక టెక్నాలజీ వాహనాలపై అవగాహన కల్పించారు. సింగిల్ సిలండర్ బైక్, మల్టీ సిలండర్ బైక్, వాహనం భాగాలు కలపడం, విడదీయడం వంటి అంశాలను విద్యార్థుల చేతుల మీదుగా చేయించి వారికి ప్రయోగాత్మకంగా జ్ఞానం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇ. సుధీర్, జి. వరుణ్, త్రినాధరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







