అమరగిరిపై భక్తులు రద్దీ

UPDATED 11th FEBRUARY 2018 SUNDAY 8:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని అమరగిరిపై వేంచేసివున్న పంచాయతన సహిత ఛాయా, ఉషా, ప్రజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  స్వామి, అమ్మవార్లకు ఉదయం సుప్రభాతసేవ, సాయంత్రం ఊంజల్ సేవలు నిర్వహించారు. మాఘమాసం చివరి ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పాల పొంగలిని నైవేద్యంగా సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు వై. అనంత లక్ష్మీదేవి, రవికిషోర్, రవి కిరణ్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us