UPDATED 24th JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం పవర గ్రామంలో రూ.ఒక కోటి 65 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి చినరాజప్ప ప్రతీ గ్రామంలో అభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా రూ.13 లక్షల వ్యయంతో గ్రామపంచాయతీ భవనం, రూ.24 లక్షలతో సిసి రోడ్లు, రూ.30 లక్షలతో స్మశానవాటిక అభివృద్ధి రూ.68 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సిసి రోడ్లు, రూ.5 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ, రూ.25 లక్షలతో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, గుమ్మళ్ల రామకృష్ణ, తోటకూర శ్రీనివాస్, ఎంపిడివో కె. స్వప్న, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







