గైట్ లో నానో టెక్నాలజీ అప్లికేషన్స్ పై వర్క్ షాప్

UPDATED 3rd JULY 2018 TUESDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మూడవ, ఆఖరి సంవత్సరం విద్యార్థులకు నానో టెక్నాలజీ అప్లికేషన్స్ అనే అంశంపై మంగళవారం  వర్క్ షాప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ నార్తరెన్ లోవా ప్రొఫెసర్ పి.ఎన్. రావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం ఇచ్చారు. కాన్సర్ వ్యాధి నివారణలో నానో టెక్నాలజీతో తయారుచేసి ఔషధాల పాత్ర కీలకమని అన్నారు. తడవని దుస్తులు, గీతలు కారు పెయింటింగ్, చెమటవాసన రాని దుస్తులు తయారీ నానో టెక్నాలజీతోనే సాధ్యపడుతుందని, వైద్యరంగంలో, ఔషధాల తయారీలో నానో టెక్నాలజీ చోటు దక్కించుకుందని అన్నారు. భారతదేశంలో ఎంతో కాలంగా నానో టెక్నాలజీ ఉందని తెలిపారు. గైట్ ఆటోమొబైల్ విభాగం అధిపతి వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వూడ్జ్ స్టీల్ అని పిలిచే కత్తులను ప్రపంచంలోలోని ఎన్నోదేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతి జరిగేదని, మనదేశంలో నానో టెక్నాలజీ ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ సాంకేతికరంగం అభివృద్ధితో గత కొన్ని సంవత్సరాలుగా గుర్తింపు లభించిందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. మూర్తి, అకాడమిక్ డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు కె. సుబ్బారావు, వి. సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us