UPDATED 26th JUNE 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సామర్లకోట ఎస్ఐ రవీంద్రబాబు అన్నారు. సామర్లకోట నూతన ఎస్ఐగా ఎమ్.వి.వి. రవీంద్రబాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన బి. కిషోర్ విఆర్ కు వెళ్లగా, ఆయన స్థానంలో ముమ్మిడివరం ఎస్ఐగా పనిచేస్తున్న రవీంద్రబాబు బదిలీపై సామర్లకోట వచ్చారు. భాద్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.







