దివిస్ కు నిజనిర్ధారణ కమిటీ

UPDATED 22nd DECEMBER 2020 TUESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): దివిస్ ఘటనపై బుధవారం నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించే అంశాలపై స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తొండంగి మండలంలో దివిస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు, మత్స్యకారులు చేపట్టిన ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపి రైతులపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయంపై అధ్యయనం చేయడానికి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ సభ్యులుగా జ్యోతుల నవీన్ తో పాటు బండారు సత్యనారాయణ మూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, ఎస్వీఎస్ వర్మ, వనమాడి కొండబాబు, యనమల కృష్ణుడు, పిల్లి సత్యనారాయణ మూర్తిలను నియమించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us