ఆదిత్యలో విజయవంతంగా మెగా రక్తదాన శిబిరం

UPDATED 28th JANUARY 2019 MONDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసిందని, ఈ శిబిరంలో 2213యూనిట్ల రక్తం దాతల నుంచి సేకరించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిత్య వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిత్య సిబ్బంది, విద్యార్థుల సౌజన్యంతో నిర్వహించిన ఈ మెగా రక్త దాన శిబిరాన్ని ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు ప్రారంభించిన అనంతరం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ ది ఇంటర్ నేషనల్ ఆఫ్ లైన్స్ క్లబ్స్, ఆదిత్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గోవడం ఆనందంగా ఉందని, రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చని, రాష్ట్రంలోనే అత్యధిక యూనిట్లు రక్తాన్ని అందిస్తున్న ఘనత ఆదిత్యకు దక్కుతుందని పేర్కొన్నారు. ఆదిత్య విద్యా సంస్థల సంస్థల చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి మాట్లాడుతూ 2005వ సంవత్సరం నుంచి తమ విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రతీ సంవత్సరం జనవరి, ఆగష్టు నెలల్లో ఈ మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ జిల్లాలో గల ప్రముఖ బ్లడ్ బ్యాంకులతో పాటు  ప్రభుత్వ ఆసుపత్రులకు అందచేస్తున్నామని తెలిపారు. ప్రతీ సందర్భంలో ఒక్కొక్క పర్యాయం 1500 యూనిట్లకు తక్కువ కాకుండా ఇవ్వడం జరుగుతుందని, అత్యధిక యూనిట్లు రక్తం అందించిన సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డులు సైతం తమ సంస్థ కైవసం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రక్తనిధి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో రక్తం ఇచ్చిన సిబ్బంది, విద్యార్థులను అవార్డులతో సత్కరించారు. అనంతరం శేషారెడ్డి దంపతులను లైన్స్ క్లబ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ క్యాబినెట్ సెక్రటరీ ఆర్. రవిశంకర్ పట్నాయక్, జిల్లా లైన్స్ క్లబ్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, ఎస్.వి.వి. సత్యనారాయణ, అనిల్ కుమార్, మణిబాబు, ప్రోగ్రాం చైర్మన్ పి. కనకరాజు, జిల్లా రక్తదాన శిబిరాల చైర్మన్ ఎన్. వెంకటేశ్వరావు, కళాశాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాధ్ రెడ్డి, డాక్టర్ ఆస్ధాశర్మ, ఇ.మోహన్, డాక్టర్ వల్లెం  శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వివిధ కళాశాలలకు చెందిన విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్. కోఆర్డినేటర్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us