UPDATED 8th OCTOBER 2018 MONDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేయుచున్న డాక్టర్ డి. సతీష్ కుమార్ ఆసియా ఖండంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ఉత్తమ శాస్త్రవేత్తలు వివరాలను పొందుపరిచే రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ (న్యూఢిల్లీ) సంస్థకు చెందిన ఎడిటోరియల్ బోర్డు ప్రతిష్టాకరమైన రైజింగ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఫార్మసీ రంగంలో డాక్టర్ సతీష్ కుమార్ చేస్తున్న సేవలు, పరిశోధనలకు గాను ఈ అవార్డు లభించిందని యావత్ ఆసియా లోనే ప్రతిష్టాకరమైన ఈ అవార్డు కు తమ సంస్థకు చెందిన ప్రొఫెసర్ ఎంపిక కావడం ఆనందదాయకం అని సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ ను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు.







