మహానేతకు ఘన నివాళి

UPDATED 2nd SEPTEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జోహార్‌ వైఎస్సార్‌ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రసన్నఆంజనేయస్వామి దేవాలయం, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాల్లో గల వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, పార్టీ నాయకులు దవులూరి దొరబాబు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిరి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, రోగులకు రొట్టెలు, బిస్కెట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజల మనసు చూరగొన్న వ్యక్తిగా మహానేత ఎన్నటికి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని, రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా వైఎస్‌ భావించారన్నారు. వైఎస్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. పేదలను ఆదుకోవాలని ఆయన నిరంతరం తపన పడేవారని, ఆ ఆలోచనల నుంచి పుట్టినవే ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల లక్ష్మీనారాయణ, ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్, కంటే వీరఘవరావు, మద్దాల శ్రీను, మేకా శ్రీనివాస్, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, గోపు మురళీ, కానేటి ఎలిజబెత్ రాణి, నేతల హరిబాబు, వాసంశెట్టి గంగ, శెట్టిబత్తుల దుర్గ, గంగిరెడ్డి కృష్ణమూర్తి, సత్యన్నారాయణ, కర్రి బుజ్జి, పేర్నేటి రాయుడు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us