విద్యార్థులు విషయ పరిజ్జానం పెంపొందించుకోవాలి

UPDATED 9th JANUARY 2019 WEDNESDAY 8:00 PM

గండేపల్లి: విద్యార్థులు విషయ పరిజ్జానం పెంపొందించుకోవాలని ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాలలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫార్మా బుక్ సిండికేట్ ఫార్మా మెడ్ ప్రెస్ సౌజన్యంతో బుధవారం  పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవిశంకర్ మాట్లా డుతూ పుస్తక ప్రదర్శనల వల్ల నూతన రచనలు ఆవిష్కరణలకు సంబంధించిన పుస్తకాలు, వివిధ పుస్తకాల రచయితల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఫార్మా బుక్ సిండికేట్, ఫార్మా మెడ్ ప్రెస్ ప్రతినిధి దాస్ మాట్లాడుతూ హైదరాబాదుకు చెందిన తమ సంస్థ ద్వారా ప్రచురితమయ్యే పుస్తకాలను విద్యార్థులకు, అధ్యాపకులకు పరిచయం చేసేందుకే రాష్ట్రంలో గల అన్ని ప్రముఖ కళాశాలల్లో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని, గుంటూరులో చలపతి, భీమవరం విష్ణు, తూర్పుగోదావరి జిల్లాలో ఆదిత్య కళాశాలలు, విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఫార్మసీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us