* ఆర్డీవో మల్లిబాబు
UPDATED 4th JULY 2020 SATURDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): మన్యం వీరుడు అల్లూరి ఉద్యమ స్ఫూర్తి అందరికి ఆదర్శమని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆర్డీవో తొలుత సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు మన్యం వీరునిగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. బ్రిటిష్ సైనికులతో ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపై ఉందని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని, సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మి, దాని కోసం తన ప్రాణాలర్పించిన యోధుడు అని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిటీలు భానుకుమార్, రామ్ కుమార్, సాగర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.







