పట్టణ ప్రజలకు మరింత ఆహ్లాదం

UPDATED 28th AUGUST 2017 MONDAY 1:00 PM

పెద్దాపురం : పట్టణ ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ మున్సిపల్ పార్క్ సుందరీకరణకు రూ.20 లక్షల వ్యయంతో సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దాపురం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అందరి సహాయసహకారాలతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజలకు ఆహ్లాదాన్ని పంచి వారి ఆనందాన్ని మరింత పెంచేందుకు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కృషి చేస్తున్నారన్నారు. పట్టణాన్నిమరింతగా సుందరీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, కౌన్సిలర్స్ అనివిళ్ళ లక్ష్మీనాగమణి, ఆకుల కృష్ణ బాపూజీ, కుండల హరిబాబు, కొయ్యన రాజు, గెడ్డం పెద కాపు, కూనిరెడ్డి అరుణ, కాకినాడ రామారావు, షేక్ జాని, ఆరెళ్ళ రాఘవ, కమీషనర్ బి.ఆర్.శేషాద్రి, ఎఈ పి.వి.సుధాకర్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us