కిడ్నాప్ కేసులో నిందితుడు అరెస్ట్

UPDATED 25th FEBRUARY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: బాలుడిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని మంగళవారం సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ అగ్రహారం వద్ద ఈనెల 20వ తేదీ సాయంత్రం మూడవ తరగతి చదువుతున్న విద్యార్ది  వెదుళ్ళ సందీప్ ను కిడ్నాప్ చేసి రూ.20 వేలు డిమాండ్ చేసిన సిహెచ్ వర్ధన్ ను స్థానిక బ్రౌన్ పేట సమీపంలోని క్రైస్తవ సమాధుల వద్ద  అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుని వద్ద నుంచి రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పెద్దాపురం సిఐ యువకుమార్, సామర్లకోట ఎస్ఐ కిషోర్ బాబు, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.                

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us