గంగవరం, లక్కొండల్లో గౌరవ సభ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : మండలంలోని గంగవరం, లక్కొండ పంచాయతీల్లో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజల డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలి అని, నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అర్హులైన వారికి సామాజిక పింఛన్లు వెంటనే ఇవ్వాలని, పాడపోయిన రోడ్డులు వెంటనే వెయ్యాలని గౌరవం సభ ద్వారా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, మాజీ ఎంపీపీ తురోతు శ్రీరాములు ఎంపీటీసీ పండా అదినారాయణ , భాను ప్రకాష్ , బొట్టా కృష్ణ, పామర్తి వీరబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్మన చిన్నారావు శారపు సత్యవేణి, పల్లాల వెంకటరెడ్డి ,బద్రి సోమరాజు ,పండా సోమలమ్మ, సబ్బరపు శ్యామ్, కంగల జగ్గారావు, మల్లేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us