ఏపీ సీఎం కప్ అండర్-14 పోటీల విజేతలు

UPDATED 27th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీ సీఎం కప్ అండర్-14 క్రీడా పోటీలు నిర్వహించారు. బాలుర కబడ్డీ లో జి. మేడపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విన్నర్స్ గా, సామర్లకోట యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల రన్నర్స్ గా నిలిచాయి. ఖో-ఖో విన్నర్స్ గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, రన్నర్స్ గా వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు. వాలీ బాల్ విభాగంలో విన్నర్స్ గా మండల పరిధిలోని వి.కె. రాయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, రన్నర్స్ గా సిబిఎమ్ సిబిఎం సెంటినరీ విద్యార్థులు విజయం సాధించారు. బాలికల విభాగంలో విన్నర్స్ గా వేట్లపాలెం జిల్లా పరిషత్ విద్యార్థినులు, రన్నర్స్ గా యార్లగడ్డ అక్కిరాజు ఉన్నత పాఠశాల విద్యార్థినులు విజయం సాధించారు. ఖో-ఖోలో విన్నర్స్ గా వేట్లపాలెం జిల్లా పరిషత్ విద్యార్థినులు, రన్నర్స్ గా యార్లగడ్డ అక్కిరాజు ఉన్నత పాఠశాల విద్యార్థినులు గెలుపొందారు. బాలుర హ్యాండ్ బాల్ లో యార్లగడ్డ అక్కిరాజు ఉన్నత పాఠశాల క్రీడాకారులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ రంగారావు, బంగార్రాజు, వైకుంఠం, ఎండివి ప్రసాద్, వెంకటేష్, రఘురాం, సునయన, శ్రీదేవి  తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us