UPDATED 29th DECEMBER 2018 SATURDAY 6:00 PM
పెద్దాపురం: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన తెలుగు టాలెంట్ టెస్ట్ లో స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల ఆరవ తరగతి విద్యార్థిని ఎ.వి.ఎస్.డి. అమృతవల్లి విశేష ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచింది. ఈ నెల 27వ తేదీన గుంటూరులోని రెవిన్యూ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చిట్టూరి విజయప్రకాష్, సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్. రావు, వైస్ ప్రిన్సిపాల్ నీరా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







